అతన్ని పొలిటికల్ లీడర్ కాపాడుతున్నాడు
on May 21, 2025

ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్(Trivikram srinivas)పై ప్రముఖ నటి పూనమ్ కౌర్(Poonam kaur)కొన్ని రోజుల క్రితం మా మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ కి ఫిర్యాదు చేస్తు 'నా జీవితాన్ని నాశనం చేసి, ఆరోగ్యాన్ని, ఆనందాన్ని కోల్పోయేలా చేసిన త్రివిక్రమ్ పై చర్యలు తీసుకోవాలని కోరింది. రీసెంట్ గా ఈ విషయంపై మరోసారి పూనమ్ స్పందించింది.
ఇనిస్టాగ్రమ్ వేదికగా పూనమ్ పోస్ట్ చేస్తు'త్రివిక్రమ్ ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. త్రివిక్రమ్‌ను ఎవరో పొలిటికల్ లీడర్ కాపాడుతున్నాడు. ఈ విషయం ముందే చెప్పాను. ఈమెయిల్‌లో నా సమస్య తెలుపుతూ ఫిర్యాదు చేశాను. ఝాన్సీగారితో మాట్లాడితే మీటింగ్ పెడదామని చెప్పి మళ్ళీ హఠాత్తుగా నన్ను డిస్టర్బ్ చేయవద్దని చెప్పింది. నేను ఎవరి పేరు చెప్పలేదు, త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై నాకు ఫిర్యాదు ఉందని స్పష్టంగా చెబుతున్నాను. అంతేకాదు నా వద్ద సాక్ష్యాలు ఉన్నాయంటూ ఝాన్షీతో చాట్ చేసిన స్క్రీన్ షాట్లను బయట పెట్టింది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



